BREAKING : రైతుబంధుకు ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకున్న ఈసీ

-

తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్. పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా ఈ ఏడాది సాగుకు నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెండింగ్​లో పడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరగా.. రాష్ట్ర ఈసీ ఈ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘానికి తీసుకెళ్లింది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న సీఈసీ ఈనెల 28లోపు రైతుబంధు ఇచ్చేందుకు 3 రోజుల క్రితం అనుమతి ఇచ్చింది.

అయితే తాజాగా రైతుబంధుకు ఇచ్చిన అనుమతి సీఈసీ ఉపసంహరించుకుంది. నియమాలు ఉల్లంఘించారని అనుమతి ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రైతు బంధుపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని.. ఎన్నికల ప్రచార సభలపై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని ముందే షరతు విధించినా.. ఆ నిబంధనలు ఉల్లంఘించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదలకు అనుమతిని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news