తెలంగాణ రైతులకు శుభవార్త..మరో 10 రోజుల్లోనే రైతు బంధు !

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు కేసీఆర్‌ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వానా కాలం రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేసీఆర్‌ సర్కార్. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది.


ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. జూన్‌ మొదటి వారం నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం.

ఇందులో భాగంగానే జూన్‌ మొదటి వారం నుంచి.. ఆ నెల చివరి వరకు వానా కాలం సాగుకు రైతుబంధు డబ్బులను… రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్ లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు.. రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లో బదిలీ చేశారు. ఈ సీజన్ లోనూ అదే పద్ధతిని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version