అక్కడ అందరికి ముగ్గురు భార్యలు తప్పక ఉండాలట..ఎందుకంటే?

-

పెళ్ళి చేసుకోవాలి అంటే ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు..కానీ ఇప్పుడు మాత్రం చాలా భయ పడుతున్నారు..చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదా గొడవలు పడుతుంటారు.ఒక భార్య కూడా వద్దనుకొనే ఈరోజుల్లో ముగ్గరిని మెయింటైన్ చేయడం కాస్త కష్టమే..ముగ్గురు భార్యలను ఎలా చూసుకుంటారు.అదేమైనా ఆచారమా అనే సందేహం అందరికి వస్తుంది.ముగ్గురు భార్యలను ఎందుకు ఉంచుకోవాలి..దాని వెనుక ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పశ్చిమ అమెరికాలోని ఈ రాష్ట్రం పేరు ఉటా. ఇక్కడ ఉన్న అన్ని కొండలలో ఒక ప్రత్యేకమైన కొండ ఉంది. అక్కడ 100 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరు గిరిజనులు కాదు. వలస వచ్చిన వారు.. వారు తమ సొంత సంఘాన్ని సృష్టించుకున్నారు. వీరందరూ ఒక ఫండమెంటలిస్ట్ మోర్మాన్ అనుచరులు, ఇక్కడ ప్రతి మనిషికి ఒకరికంటే అధిక సంఖ్యలో భార్యలు ఉంటారు. ఈ రాతి కొండపై దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్నాయి..అందరికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉంటారు.

ఆ రాతి కొండను రాక్‌ల్యాండ్ రాంచ్ అని అంటారు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం అంటే మరణానంతరం స్వర్గం పొందడం అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ నివసిస్తున్న మోర్మాన్‌లు 1970లలో ఇక్కడికి వలస వచ్చినట్లు చెబుతారు. ఈ కల్ట్‌ను బాబ్ అనే ఫాస్టర్ ప్రారంభించారు. ఆ ఫాస్టర్‌కి ముగ్గురు భార్యలు, 38 మంది పిల్లలు ఉన్నారు. బాబ్ ఫాస్టర్ బహుభార్యత్వం ఉన్నందుకు జైలు పాలయ్యాడు. అతను జైలు నుండి విడుదలయ్యాక తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, రాక్‌ల్యాండ్ రాంచ్‌లో తన భార్యలతో నివసిస్తున్నాడు. అతని ఆలోచనతో ఏకీభవించిన, అతనిని అనుసరించిన కొంతమంది క్రైస్తవులు అతనితో రాక్‌ల్యాండ్ రాంచ్‌లో నివసించడం ప్రారంభించారు..అలా అలా అది ఒక పెద్ద కుటుంబంగా మారింది.మన దేశంలో లాగా సవతి పోరు లేకుండా అన్యొన్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version