రైతుబంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

-

రైతుబంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలని రైతందానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రెండో రోజు రూ.1278.60 కోట్లు రైతుల ఖాతాలలో జమయ్యాయి. 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో నిధులను జమ చేసింది ప్రభుత్వం. రెండు రోజులలో 39,54,138 మంది రైతుల ఖాతాలలో 1921.18 కోట్లు జమయ్యాయి. 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు అందింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం వచ్చిందన్నారు.

సాగునీటి రాక, ఉచిత కరంటుతో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందన్నారు. వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆహారశుద్ది పరిశ్రమలతో తెలంగాణ వ్యవసాయ రంగం రూపు మారబోతుందన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని వివరించారు. ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news