ఉత్తమ్ కుమార్ రెడ్డి తోలు తీస్తానంటూ బీఆర్ఎస్ అభ్యర్థి, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సూర్యాపేట జిల్లా మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన పార్టీని, ఆయన తొత్తుల తోలు తీస్తానంటూ రెచ్చిపోయారు.
సైదిరెడ్డి ఏజెంట్ బూతులో కూర్చుంటే…. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏజెంట్ కూర్చునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. నేను ఏడవ తరగతిలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఊర్లోకి రానివ్వలేదు.. హత్య కేసులు పెట్టి వేధించిన వెనక్కి తగ్గలేదని ఆగ్రహించారు. మంచిని పక్కన పెడితే… నేను ఏం చేయగలనో అందరికీ తెలుసు అన్నారు. చిన్నప్పుడు ఏ రాజకీయం చేసి వదిలిపెట్టానో మళ్ళీ అది మొదలు పెడతానని హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని.. పార్టీ విడిచి వెళ్లిన వారికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంచి సంపాదించింది అంతా వడ్డీతో సహా వసూల్ చేస్తానని హెచ్చరించారు.