WCలో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత రెండో స్థానంలో నిలిచింది. నిన్న ఇంగ్లాండ్ తో మ్యాచులో గెలుపుతో భారత్ విక్టరీల సంఖ్య 59కి చేరింది. వరల్డ్ కప్ లో టీమిండియా ఆడిన 90 వన్డేల్లో ఈ విజయాలు సాధించడం గమనార్హం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 100 మ్యాచుల్లో 73 విజయాలతో తొలి స్థానంలో ఉండగా… న్యూజిలాండ్ 95 మ్యాచుల్లో 58 విజయాలతో మూడో స్థానంలో ఉంది.
ఇది ఇలా ఉండగా.. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సత్తా చాట గా… బౌలింగ్ లో మహమ్మద్ షమీ, జస్ట్ప్రిత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్…. 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది.