హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య నియామకం..!

-

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం పంపిన ప్యాన‌ల్ నుంచి అధికారుల‌ను ఈసీ ఎంపిక చేసింది. 

యాదాద్రి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌గా గౌతమ్, ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా వాణీ ప్ర‌సాద్, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా సునీల్ శ‌ర్మ‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్‌గా క్రిస్టినా నియామ‌కం అయ్యారు. 

  1. అంబ‌ర్ కిషోర్ ఝా – వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్
  2.  క‌ల్మేశ్వ‌ర్ సింగేనేవ‌ర్ – నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్
  3.  చెన్నూరి రూపేశ్ – సంగారెడ్డి ఎస్పీ
  4.  సింధూ శ‌ర్మ – కామారెడ్డి ఎస్పీ
  5.  సంప్రీత్ సింగ్ – జ‌గిత్యాల ఎస్పీ
  6.  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ
  7.  వైభ‌వ్ ర‌ఘునాథ్ – నాగ‌ర్‌క‌ర్నూల్ ఎస్పీ
  8.  రితిరాజ్ – జోగులాంబ గ‌ద్వాల్ ఎస్పీ
  9.  పాటిల్ సంగ్రామ్ సింగ్ గ‌ణ‌ప‌తి రావ్ – మ‌హ‌బూబాబాద్ ఎస్పీ
  10.  యోగేష్ గౌత‌మ్ – నారాయ‌ణ‌పేట ఎస్పీ
  11.   కిర‌ణ్ ప్ర‌భాక‌ర్ – భూపాల‌ప‌ల్లి ఎస్పీ
  12. రాహుల్ హెగ్డే – సూర్యాపేట ఎస్పీ

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో సీనియర్‌ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version