BEST PLAYER OF SEPTEMBER: “డెంగ్యూ” తో బాధపడుతున్న గిల్ కు ఐసీసీ అవార్డు!

-

తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ అఫ్ ది మంత్ సెప్టెంబర్ కు ఇండియా ప్లేయర్ శుబ్ మాన్ గిల్ విన్నర్ గా నిలిచి అవార్డును సాధించాడు. కాగా శ్రీలంక లో జరిగిన ఆసియా కప్ లో భాగంగా శుబ్ మాన్ గిల్ చెలరేగి ఆడి ఇండియాకు టైటిల్ ను అందించాడు. సెప్టెంబర్ నెలలో జరిగిన వన్ డే లలో గిల్ 480 పరుగులు చేసి ఈ అవార్డును అందుకున్నాడు. కాగా ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఇండియా క్రికెటర్ గా ఘనతను సాధించాడు. డెగ్యూ తో బాధపడుతున్న గిల్ కు ఇది ఉపశమనాన్ని ఇచ్చే వార్త అని చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇండియాకు ఎంపికైనా ఇంకా మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. గిల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూ ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు.

కాగా ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగుంది అందుకే రేపు పాకిస్తాన్ తో అహమదాబాద్ లో జరగనున్న మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version