సెప్టెంబర్ 10 న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా కు వస్తున్నారని.. తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. తెల్దారు పల్లిలో టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిందని… జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.
మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు సిపిఎం ప్రకటించిందన్నారు. సిపిఎం ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ లు కనుమరుగయ్యాయి.. బీజేపీ పై మతతత్వ పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు.
తెల్దారు పల్లిలో వేరే పార్టీ జెండా ఎత్తితే హత్యలు జరుగుతున్నాయి.. హత్య కేసులో లేనివారు ఎందుకు పారిపోయారు.. గ్రామంలో ఎందుకు దండయాత్ర చేశారని నిప్పులు చెరిగారు. మీ సొంత గ్రామంలో వస్తున్న ఆరోపణలపై తమ్మినేని వీరభద్రం సమాధానం చెప్పాలి.. మీ పార్టీ నేత హత్య జరిగితే ముఖ్యమంత్రి,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించలేదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.