కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలంగాణ మహిళలను అవమానించారని…. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ‘జీవన్ రెడ్డి బతుకమ్మ పండుగను అవమానించారు. ఎమ్మెల్సీ కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మందు బాటిళ్లు పెట్టి బతుకమ్మ ఆడాలన్న వాక్యాలు దారుణం. ఓడిపోతామనే తెలిసే ఆయన ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు’ అని సత్యవతి మండిపడ్డారు.
కాగా, BRS మళ్లీ గెలిస్తే.. బతుకమ్మపై లిక్కర్ బాటిల్ పెడతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీపై కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. ‘గతంలో ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత షుగర్ ఫ్యాక్టరీ మూసి వేయించారు. ఇదేనా ఆమె అభివృద్ధి? గతంలో ఎలిజిబెత్ క్వీన్ ఉండేది. ఇప్పుడు లిక్కర్ క్వీన్ వచ్చింది. మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే…. బతుకమ్మపై లిక్కర్ బాటిల్ పెడతారు. గుమ్మడి పువ్వు గౌరమ్మ బదులు… విస్కీ బాటిల్ పెడతారు’ అని ఆయన వాక్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు.