ఎస్సీ వర్గీకరణ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీలో నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే  ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ సంఘాల నాయకులు.   ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చినట్టు తెలిపారు. ఎస్సీలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని తెలిపారు. వర్గీకరణ సుప్రీంకోర్టులో క్లియర్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్ చేసింది.

తనను ఒక్కడినే అభినందించడం కాదు.. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రాష్ట్రకేబినెట్ ని చప్పట్లతో అభినందించాలని కోరారు. రాహుల్ గాంధీ పట్టుదలతో లేకపోతే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసే శక్తి రాదు. రాహుల్ గాంధీ తానున్నానని చెప్పడంతోనే చేసినట్టు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ గా పెట్టాలని దామోదర రాజనర్సింహ సూచించారు. అత్యంత నిజాయితీ పరుడు షమీ మక్తర్ ని వన్ మ్యాన్ కమిషన్ కి ఎంపిక చేశామని తెలిపారు. గ్రూపు బీ కి 9 శాతం కాదు.. 9.75 శాతం రిజర్వేషన్లు కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news