రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును వెనక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ఉన్న 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను డీఈవోను అడిగి తెలుసుకున్నారు. గాయడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు గాయపడిన చిన్నారుల రోదనలతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. నొప్పితో ఏడుస్తున్న చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.