భవిష్యత్తు కాలంలో ఉత్తర తెలంగాణ ఉద్యమం వస్తుందని బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలలో వివిధ జిల్లాలకు కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు నిధులు ఎక్కువగా కేటాయించారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క.
ఈ తరుణంలో బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను దక్షిణ తెలంగాణకు కేటాయించి ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2900 కోట్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గానికి 100 కోట్లు, బడ్జెట్లో కేటాయించాలని తెలిపారు. ఇక తన నియోజకవర్గంపై, తనకు రావాల్సిన నిధులపై మాట్లాడేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఛాన్స్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఇలాగే జరిగితే త్వరలోనే ఉత్తర తెలంగాణ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.