కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డే – కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు భువనగిరి పార్లమెంటు పరిధిలో నీటిపారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ లు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోష్యం చెప్పారు. నల్గొండ ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారని.. ముందు ముందు ఆయన తప్పకుండా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని.. తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రి ఉత్తమ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

దీంతో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలను రీడిజన్ చేయాలని, కాలువల వెడల్పు పెంచితే దీని ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందన్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూర దృష్టితో ప్రతిపాదనలు పంపాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version