హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. కబ్జాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్క్ లు కబ్జాచేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరహాలో వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్
చేస్తామని కీలక ప్రకటన చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ లో నేరుగా కేసులు నమోదు చేయబోరని.. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నాంపల్లి ఏసీజే
ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసులను విచారణ చేస్తారని తెలిపారు.
కబ్జా చేసినట్టు నిరూపణ అయితే తప్పకుండా జైలు శిక్ష పడుతుందని వెల్లడించారు. కాగా, ఇటీవలే హైడ్రా పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాణిగంజ్లోని బుద్ధభవన్ పక్కనున్న జీ+2 భవనంలో ఈ స్టేషన్ ని ఏర్పాటు చేశారు. మొదటి ఎస్చ్గా ఏసీపీ పి. తిరుమల్ నియమితులయ్యారని, మరో ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12మంది ఎస్సైలు, 30మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు.
ఆక్రమణదారులపై కేసు నమోదుచేసి, వేగవంతమైన విచారణతో సత్వర చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.