ఈటెల మతి తప్పి మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడే నీచ భాష ఆపకపోతే అంతకు మించిన భాష వాడాల్సి వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తీవ్ర స్థాయిలో విరుచు కుపడ్డారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఈటెల చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
అలాగే ఇప్పటివరకు ఈటెల మర్యాదస్తుడు అనుకున్నామని, కానీ ఆయనకు మతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పదవులు, రాజకీయాల కోసం ఆయన దిగజారి పోయి మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే మీ అధిష్టానాన్ని కాక పట్టుకోవాలి.. కానీ మా ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకానికి నిదర్శం అని ఎద్దేవా చేశారు. అంతేగాక మీరు నీచ భాష ఆపకపోతే మేం అంతకు మించిన భాషను వాడాల్సి వస్తోందని హెచ్చరించారు.