రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ఆ కేసులో నిందితుడికి జీవిత ఖైదు

-

రంగారెడ్డి జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2016లో సరూర్ నగర్  ప్రాంతానికి చెందిన బాలికపై హరీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలు పెట్టారు. అయితే, ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పోలీసులు వాటిని కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడు హరీష్కు జీవిత ఖైదును విధించింది. అదేవిధంగా బాధితురాలికి తీర్పు వెలువడిన వెంటనే రూ. 10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని తీర్పును వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version