సెరికల్చర్ ఖాళీలను భర్తీ చేయాలి.. శాసనమండలిలో ప్రశ్నించిన కవిత..!

-

రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ శాసన మండలి సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని వెల్లడించారు. ప్రభుత్వం రూ.16కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పెట్టకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

సెరికల్చర్ విభాగంలో ఖాలీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూరు నుంచి పట్టు దిగుమతితో చేనేతలకు అదనపు భారం అన్నారు. తేనెటీగల పెంపకం అనేది రైతులు, అడవులకు మంచిది అని తెలిపారు. దిగుబడి పెంచే ఆస్కారం ఉందని.. గిరిజనులకు ఉపాధి ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్పేర్ స్కూల్స్ ఉండేవని, తెలంగాణ ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో 275 బీసీ పాఠశాలలు, 31 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ కొత్తగా ఒక్క బీసీ గురుకులంను కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news