మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆల్టో కారుకు రోడ్డు ప్రమాదం జరగడంతో ఏకంగా ముగ్గురు మరణించారు. ఈ సంఘటన ఆదివారం రోజు రాత్రి… జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లాలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. వీళ్లంతా ముస్లిం ఫ్యామిలీకి చెందిన వారు కావడం గమనార్హం. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట గేటు వద్ద హైదరాబాద్ – మెదక్ నేషనల్ హైవే మీద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా వైపు వెళ్తున్న ఆల్టో కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఎండి గౌస్, అలీ అలాగే అజీమ్ వేగంగా గుర్తించారు పోలీసులు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు… సమాచారం అందుతోంది. గాయలపాలెం అయిన వారిని నరసాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.