తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తికి వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నారాయణపేట, గద్వాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు 51 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. మరోవైపు రాబోయే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల వానలు పడ్డాయి.