తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌.. 7 గురు మావోయిస్టులు మృతి !

-

తెలంగాణలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ భారీ ఎన్‌ కౌంటర్‌ లో 7 గురు నక్సలైట్లు మృతి చెందారు. ఈ సంఘటన కాసేపటి క్రితమే జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్‌ ఘడ్‌, తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఏటూర్ నాగారం అడవుల్లో మావోయిస్టులకు అలాగే, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Seven Maoists killed in an encounter in Telangana

ఇక ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే… ఈ ఎన్‌ కౌంటర్‌ ను ఇంకా ములుగు జిల్లా పోలీసులు ధృవీకరించలేదు. ఏటూరు నాగారం మండలంలోని చల్పాకా అడవి ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగిందట. ఇటీవల వాజేడులో ఇద్దరు వ్యక్తులను పోలీస్ ఇన్ ఫార్మర్ ల నేపంతో చంపారు మావోయిస్టులు. నాటి నుంచి మావోయిస్టుల కోసం అభయారణ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు…ఇవాళ 7 గురిని ఎన్‌కౌంటర్‌ చేశారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version