శభాష్ పోలీస్ అన్న.. తలకు గాయమైనా నిమజ్జనం డ్యూటీ..!

-

సాధారణంగా గణేష్ నిమజ్జనం జరుగుతుందంటే అది ఎక్కడైనా పోలీసుల పాత్ర కీలకం అనే చెప్పాలి. ఆ ప్రాంతంలో గొడవలు జరుగకుండా భద్రత కోసం పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. ఒకవేళ పోలీసులు కూడా లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే గ్రేటర్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎస్సై బొజ్జ రవీందర్ తలకు గాయమై రక్తం కారుతున్నప్పటికీ.. నిమజ్జనం విధుల్లో సేవలందించి భక్తుల మనస్సులు గెలుచుకున్నారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

గుండ్ల సింగారం ముచ్చర్ల ఓఆర్ఆర్ వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉండగా.. తెల్లవారుజామున ఎస్సై తలకు దెబ్బతాకిందని పోలీసులు వెల్లడించారు. సున్నితమైన వద్ద దెబ్బ తాకడంతో టోపీ కింద గాయమైన ప్రాంతం నుంచి ముఖం మీదకు రక్తం కారడం ప్రారంభం అయింది. అక్కడే ఉన్న మరో పోలీస్, వివిధ శాఖల సిబ్బంది ఎస్సై ని చూసి ఆందోళన చెందారు. ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వినాయక విగ్రహాలు వరుస కట్టి ఉండటంతో ఆఫీసర్ నొప్పిని భరిస్తూనే డ్యూటీలో ఉన్నారు. రక్తం అలాగే రావడంతో సమీపంలోని 108 సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ అందించారు. విశ్రాంతి తీసుకోవాలని మెడికల్ సిబ్బంది సూచించినా.. ఎస్సై రవీందర్ వినకుండా 10 నిమిషాల్లో మళ్లీ విధుల్లో చేరి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేవిధంగా చూశారు. దీంతో  అతన్ని అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version