చాణుక్య నీతి: మీ బెస్ట్‌ఫ్రెండ్‌లో ఈ లక్షణాలు ఉంటే మీ అంత అదృష్టవంతుడు మరొకడు లేడు

-

స్నేహం అయినా ప్రేమ అయినా నమ్మకం మీదనే ఆధారాపడి ఉంటుంది. కానీ మీరు ఒక వ్యక్తిని నమ్మలాంటే.. వారు మీకు దగ్గరవ్వాలి. మంచి భాగస్వామి ఎలా ఉండాలి, మంచి స్నేహితుడు ఎలా ఉండాలి అని చాణుక్యుడు ఎప్పుడో చెప్పాడు. మంచి స్నేహితుడిగా మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.., మీ బెస్టీలో ఉన్నాయా లేవా అని ఒక్కసారి పరిశీలించుకోండి.

ప్రతి వ్యక్తి జీవితంలో మంచి సంబంధాలు చాలా ముఖ్యమైనవి. మంచి అనుబంధం ఉన్న వ్యక్తులు జీవితంలోని కష్టాల్లో మీకు తోడుగా ఉంటారు. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించాలంటే మంచి సంబంధాలు చాలా అవసరం. అందుకే మంచి సంబంధాలు ఎప్పుడూ చెడిపోకూడదు. చాణక్యుడు తన చాణక్య నీతిలో మానవులు సంబంధాలను బలంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో వివరించాడు. ప్రతి ఒక్కరికి తెలిసిన మొదటి నిజం ఏమిటంటే, చెడు సమయంలో మీతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. మన సుఖాల్లోనే కాదు.. మన కష్టాల్లో కూడా మనకు తోడుగా ఉండేవాడు స్నేహితుడు ఇదైతే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇవి కాకుండా చాణుక్యుడు చెప్పిన దాని ప్రకారం మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

నీ బాధలో నిన్ను ఆదుకోని, స్పందించని, అండగా నిలివని స్నేహితుడు ఎప్పటికీ మంచి మిత్రుడు కాలేడనీ, అలా లేని వ్యక్తితో స్నేహం కొనసాగించడం మంచిది కాదని చాణక్యుడు చెప్పాడు. అందుకే మీరు నిజమైన స్నేహితుడిని కనుగొనడం మరియు అతనితో సమయం గడపడంపై దృష్టి పెట్టాలి. మీ నిజమైన స్నేహితుడిని మీరు ఎంత గౌరవిస్తారో, మీ స్నేహం అంత లోతుగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు.

మన ఆలోచనలను వ్యతిరేకించే వారితో స్నేహం పెంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. అవి మన విశ్వాసాన్ని తగ్గిస్తాయి. అవి మనలో ప్రతికూలతను నింపుతాయి.

మనసు లేని వారితో స్నేహం చేయకూడదని చాణుక్యుడు అన్నారు. ఇలాగైతే స్నేహం చెడిపోతుంది. మనం మాట్లాడుకోవడానికి ఆసక్తిగా ఏమీ లేనప్పుడు, ఆ స్నేహం ఎక్కువ కాలం నిలవదు.

ధనవంతులతో స్నేహం చేసేవారి వెనుక ఒకరకమైన స్వార్థం ఉండవచ్చు. అతను తన స్నేహితుడి డబ్బును సద్వినియోగం చేసుకోవాలని అనుకోవచ్చు. అలాంటి స్నేహితుల గురించి తెలుసుకోండి. చాణుక్యుడు ఇంకో విషయం కూడా చెప్పారు, మనం ఎప్పుడూ వ్యతిరేక స్వభావం గల వారితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే పాములు, మేకలు, పులులు ఒకదానికొకటి ఎప్పుడూ స్నేహంగా ఉండవు.

చాణక్యుడు ఏ స్నేహితుడిని గుడ్డిగా నమ్మవద్దు అంటాడు. ఎందుకంటే రిలేషన్ షిప్‌లో సమస్య వచ్చినప్పుడు ఆ స్నేహితుడు మీ రహస్యాలన్నింటినీ బయటపెడతాడు. మిమ్మల్ని ఎక్కువగా పొగిడే వారితో స్నేహం చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు జీవితంలో మోసం చేసే అవకాశం ఎక్కువ.

ఇన్ని ఫిల్టర్ల తర్వాత మంచి స్నేహితులను కాపాడుకోవడం స్నేహితులుగా మన కర్తవ్యం అంటాడు చాణక్యుడు. నిజమైన స్నేహితుడు సంతోషకరమైన సమయాల్లో మరియు కష్ట సమయాల్లో మనకు అండగా ఉంటాడు. మనం ఆయనకు అండగా నిలవాలి. స్నేహితుడిని సమస్యలకు దూరంగా ఉంచడమే నిజమైన స్నేహితుడి పని అని చాణక్యుడు చెప్పాడు. మీ జీవితంలో ఇప్పటికే అలాంటి వారు ఉంటే.. వారిని అస్సలు వదులుకోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version