షర్మిల కడప రాజకీయాలను ఇక్కడ చూపిస్తున్నారు – పువ్వాడ అజయ్

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు సెక్రటేరియట్ ముట్టడికి వెళతారనే సమాచారంతో పోలీసులు ఆమె ఇంటి వద్ద షర్మిలని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే హౌస్ అరెస్ట్ కి ప్రయత్నించిన పోలీసులపై ఆమె దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్.

షర్మిల కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మంలోనూ కడప తరహా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పువ్వాడ అజయ్. ఇక రాబోయే ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు పదికి పది గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version