సంక్రాంతికి జాతర పోదామా.. ప్రారంభమైన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు…

-

కోర్కెలు తీర్చే కొంగు బంగారం… వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈరోజు (జనవరి 13) నుంచి ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు సాగే ఈ జాతరకు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు సౌకర్యాలు కల్పించారు.

అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. జాతరకు ప్రత్యేక బస్సులు, అదనపు క్యూలైన్లు,తాగునీరు, చలువ పందిళ్లు, సాచాలయాలు వంటి మౌలిక సదుపాయాలను అధికారులు కల్పించారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news