వాహన‌దారుల‌కు మ‌రోసారి షాక్.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

-

వాహ‌న‌దారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు మ‌ళ్లీ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగిన విషయం తెలిసిందే. ఒక్క రోజు గ్యాప్ తో మ‌రో సారి నేడు పెట్రోల్, డీజిల్ ధ‌రలు పెరిగాయి. నేడు లీట‌ర్ పెట్రోల్ పై 90 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 87 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. కాగ మంగ‌ళ‌వారం, బుద వారం వ‌రుస‌గా రెండు రోజులు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి.

గురు వారం శాంతించిన ధ‌ర‌లు.. నేడు మ‌రోసారి పెరిగి.. వాహ‌నదారులపై పిడుగుప‌డేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రోజుల పాటు పెరిగ‌న పెట్రోల్ ధ‌ర‌లు ప్ర‌తి సారి లీట‌ర్ పై 90 పైస‌ల చొప్పున పెరిగింది. అలాగే లీట‌ర్ డీజిల్ పై 87 పైస‌ల చొప్పున పెరిగింది. అంటే ఈ మూడు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర‌లు దాదాపు రూ. 3 వ‌ర‌కు పెరిగింది. కాగ ఈ పెరిగిన ధ‌ర‌ల‌తో తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 110.89 కి చేరింది. అలాగే డీజిల్ ధ‌ర రూ. 97.22 కు చేరింది. అలాగే ఏపీలోని గుంటూర్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.96 కు చేరింది. డీజిల్ ధ‌ర రూ. 98.94 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news