తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ !

-

Shock to Telangana Speaker Gaddam Prasad Social media account hacked: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ను… హ్యాక్ చేసి అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Shock to Telangana Speaker Gaddam Prasad Social media account hacked

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం నా వ్యక్తిగత అకౌంట్ ట్విట్టర్.. (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయిందని పేర్కొన్నారు. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారని వెల్లడించారు. నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను అంటూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news