ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు కావడంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధినాయకత్వం జనవరి 16న ఖరారు చేసింది. నామినేషన్లకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలని కూడా వారికి సమాచారం ఇచ్చింది.
తుంగతుర్తి నుంచి గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోయినా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన అద్దంకి దయాకర్ తో పాటు NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరి పేర్లు ఖరారు అయినట్టు సమాచారం.
అయితే ఇంతలోనే అద్దంకి దయాకర్ కి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ కి కేటాయించి కాంగ్రెస్ అధిష్టానం. నిన్ననే అద్దంకి దయాకర్, వెంకట్ పేర్లను ఖరారు చేసినట్టు వార్తలు రావడం.. వారిని నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పడం.. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ పేరు కేటాయించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహేస్ కుమార్ గౌడ్ అధిష్టానం వద్దకు టికెట్ తెచ్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ దళితుడు అయిన అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడం కాస్త నిరాశకు గురైనట్టు సమాచారం.