హనుమకొండలో లైవ్ మర్డర్.. అక్రమ సంబంధమే కారణం !

-

హనుమకొండ జిల్లా వ్యక్తి ప్రాణం తీసింది వివాహేతర సంబంధం. హనుమకొండ నడిబొడ్డులో దారుణం జరిగింది. హనుమకొండ నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కు గురయ్యాడు. హనుమకొండ లో అదాలత్ జంక్షన్ సమీపంలో ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది. మృతుడు మడికొండ కు చెందిన మాచర్ల రాజ్ కుమార్ అని సమాచారం అందుతోంది.

అయితే… బొల్లికొండ లావణ్య అనే మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారట రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్ ను హత్య చేశారు వెంకటేశ్వర్లు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం కు తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుబేదారి పోలీసులు. నిందితుడు, మృతుడు ఇద్దరూ ఆటో డ్రైవర్లు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news