జాబితాలో పేర్లు లేనివారికి దరఖాస్తులకు మరో అవకాశం : మంత్రి దామోదర రాజనర్సింహ

-

జాబితాలో పేర్లు లేని వారికి దరఖాస్తులకు మరో అవకాశం కల్పించినట్టు మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పెట గ్రామ సభకు హాజరయ్యారు మంత్రి దామోదర రాజనర్సింహ.  గత ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని మంత్రితో కష్టాలు చెప్పుకున్న గ్రామస్తులు.. త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ వారి సమస్యలను అక్కడికక్కడ పరిష్కరిస్తూ.. అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి.. వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడతాయన్నారు. పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వం పథకాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పథకాలకు లబ్దిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు లేదన్నారు. దశలవారిగా ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇళ్లు, రేషన్ కార్డు ఇస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా రూ.12వేలు అందజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news