టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరామ్ పూర్ వాసులతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. మీసేవ మొబైల్ యాప్ ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్టు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.