ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో ప్రారంభం

-

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎయిర్ షోను ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. ఎయిర్ షో సందర్భంగా ట్యాంక్ బండ్ అంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లోకి వచ్చే వాహనాలను పక్కకు దారి మళ్లించారు.

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్స్ ఆధ్వర్యంలో  ట్యాంక్ బండ్ పై జరుగుతున్న ఎయిర్ షో చూపరులను కనువిందు చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన జరుగుతుంది. వాయిసేన గ్రూప్  కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో జరుగుతున్న ఎయిరోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎయిరో, మ్యూజికల్ కన్సర్ట్ నేపధ్యంలో నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్ లో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news