11 నెలల్లో సీఎం నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు : హరీష్ రావ్

-

పదకొండు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు అని మాజీ మంత్రి హరీష్ రావ్ అన్నారు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని తెలిపారు.

అలాగే నువ్వు కేసీఆర్.. కేసీఆర్.. అంటూ కేసీఆర్ గారి నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు అన్నారు. ఇక తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్ లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అని హరీష్ రావ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version