ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల తో కుమ్మక్కై మంత్రులు దోచుకుంటున్నారు అని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో వ్యవసాయం తెలిసిన మంత్రులు లేరు. ధాన్యం దిగుబడి గతంలో కంటే ఈసారి పెరిగింది అనేది ఆవాస్తవం అని ఆయన అన్నారు. అలాగే మా ప్రభుత్వంలోనే దిగుబడి పెరిగింది, ధాన్యానికి అధిక రేటు వచ్చింది.. ఇప్పుడు కనీసం ధర కూడా ఇవ్వడం లేదు అన్నారు.
ఇక ఎంత ధాన్యం కొనుగోలు చేశారో లెక్కలు ప్రజలకు చెప్తే.. కాంగ్రెస్ బాగోతం బయటపడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కాలేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం. బాహుబలి మోటర్లు ఆన్ చేసిన తర్వాతనే ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందింది అ విషయం రైతులకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. గొప్పలు చెప్పుకోవడంలో కాంగ్రెస్ అరితేరింది. అసలు కాంగ్రెస్ విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేసుకోవాలి. కాంగ్రెస్ అంటేనే గ్రామాల్లో తరిమికొట్టేలా ఉన్నారు రైతులు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.