నేడే బొగ్గు గనుల వేలం.. ‘శ్రావణపల్లి’ని సాధించాలన్న పట్టుతో సింగరేణి

-

దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇవాళ మధ్యాహ్నం వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఒక్కో నగరంలో వేలం నిర్వహిస్తుండగా ఈ ఏడాది హైదరాబాద్ లో ఈ ప్రక్రియ జరగనుంది.  ఈ వేలంలో తొలిసారిగా సింగరేణి సంస్థ పాల్గొనబోతున్నట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తుంది. హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం ప్రారంభిస్తారు. వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలున్నట్లు భూగర్భ సర్వే  తేల్చింది. తొలిసారిగా బిడ్డింగ్ లో పాల్గొంటున్న సింగరేణి సంస్థ ఎలాగైనా శ్రావణపల్లి బొగ్గు గనిని వేలంలో దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఈసారి వేలంలో పాల్గొనాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news