టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్.. ఆ కేసులన్నీ కొట్టివేత

-

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నమోదైన కేసుల్లో ఆరు కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. డ్రగ్స్‌ కేసు నమోదులో సరైన ప్రొసీజర్‌ పాటించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2017 జులైలో ఆబ్కారీ శాఖ డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్‌ను అరెస్ట్ చేసి అతని సెల్‌ఫోన్‌, బ్యాంకు ఖాతాల ఆధారంగా దాదాపు 60 మందిని ప్రశ్నించారు. బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను సిట్‌కు బదిలీ చేశారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించి.. సినీ రంగానికి చెందిన 12 మందిని పిలిచి ప్రశ్నించారు.

దర్యాప్తు పూర్తైన తర్వాత 12 నేరాభియోగ పత్రాలను వివిధ కోర్టులలో దాఖలు చేసిన ఆబ్కారీ అధికారులు  ఏ నేరాభియోగపత్రంలోనూ సినీ రంగానికి చెందిన వాళ్ల పేర్లను పొందుపర్చలేదు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన కొంతమందిని నేరాభియోగ పత్రాల్లో నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ల పాత్రపైన సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఇందులో నాంపల్లి కోర్టు 4 కేసులను, రంగారెడ్డి జిల్లా కోర్టు రెండు కేసులను కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news