తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇవాళ సభ ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. ఈ మేరకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్ షిప్) బిల్లు 2024 ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు బడ్జెట్ పద్దులపై శాసనసభలో నేడు చివరి రోజు చర్చ జరగనుంది. 19 పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగడంతో పాటు మంత్రుల సమాధానం ఉంటుంది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, పర్యాటకం, క్రీడలు, అటవీ, దేవాదాయ, చేనేత, ఐ అండ్ పీఆర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా-శిశు సంక్షేమ శాఖ పద్దులపై చర్చ జరగనుంది. ఇవాళ కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. నిన్న 17 గంటలకు పైగా అసెంబ్లీ కొనసాగింది. తెల్లవారుజాము 3.15 గంటలకు కొనసాగింది.