తెలంగాణలోని నల్గొండ జిల్లాలో SLBC ప్రాజెక్ట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ది పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నల్గొండ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. నల్గొండ లో గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు SLBC సొరంగానికి శంకు స్థాపన చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించినందుకు “ఆర్.ఆర్.” గా నామకరణం పెట్టుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఆర్.ఆర్. అంటే.. రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని సభలో చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉంటే పాలన.. లేకుంటే ఫామ్ హౌస్ లో కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ SLBC ప్రాజెక్టు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కి నిధులు కేటాయిస్తే.. ప్రాజెక్ట్ పూర్తయి నల్గొండ జిల్లా కళకళలాడేదని తెలిపారు.