సాధారణంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే రెండు, మూడు గురుకుల పాఠశాలలో పాము కల కలంతో పాటు ఓ స్కూల్ లో ఏకంగా విద్యార్థి మరణించిన ఘటనలు మనం చూసాం. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాములు దర్శనమిస్తున్నాయి.
ఇవాళ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల తహశీల్దార్ కార్యాలయంలో పాము ఒక్కసారిగా కనిపించడంతో గురువారం విధులకు హాజరైన ఉద్యోగులందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్న ఉధ్యోగులకు తహసీల్దార్ ఛాంబర్ లోని ముందు గదిలో పాము కనిపించడంతో కంగారుగా పరుగులు పెట్టారు. కొద్ది సమయం తరువాత సమయస్ఫూర్తితో పామును పట్టుకొని పక్కనే ఉన్న అడవిలో వదిలేశారు. పూర్వ కాలంలో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతోనే పాము దర్శనమిచ్దిందంటున్నారు. చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల కూడా విష సర్పాలు కార్యాలయం లోపలికి వస్తున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.