మేడ్చల్ జిల్లాలోని పూడూర్‌లో గల ఓ ఫామ్ హస్‌లో పేకాట స్థావరం పై SOT పోలీసుల దాడి చేశారు. మొత్తం 18 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు దాడులు చేసి పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.4 లక్షల నగదు, 12 కార్లు, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారంతా బడా బాబులుగా గుర్తించారు. ప్రస్తుతం వారందరినీ స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. జూదం ఆడుతున్నారని, అందుకోసం డెన్ ఏర్పాటు చేశారని ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందడంతో మెరుపు దాడులు జరిపి అక్కడున్న జూదరులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.