మహదేవపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎస్పీ కిరణ్ ఖరే. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, కేసుల స్థితి గతులు అడిగి తెలుసుకోగా, సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకుని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మహదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నందున మావోయిస్టుల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల భద్రతకై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదు చేయగానే విచారణ జరిపి, న్యాయం చేయాలన్నారు. పోలీసులు క్రమశిక్షణగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని అన్నారు. ఆ తర్వాత అధికారులతో కలిసి పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించిన SP పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు