అసెంబ్లీలో జెండా ఆవిష్కరించిన స్పీకర్.. మండలిలో ఛైర్మన్ గుత్తా

-

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

పోచారం వెంటే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. గుత్తా కూడా అంబేడ్కర్, గాంధీ విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మండలిలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఇవాళ ఉదయం 10.30 గంటలకు పబ్లిక్‌ గార్డెన్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం వేదికపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేసి గౌరవవందనం స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల పరిధిలోని కార్యాలయాల్లోనూ జాతీయజెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఇవాళ సాధారణ సెలపు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version