బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేక వాటర్ బాటిళ్లు

-

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేక వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 25 సంవత్సరాల విజయయాత్రకు గుర్తుగా ప్రత్యేక గుర్తింపు వచ్చేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేక వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో రూపొందించారు వాటర్ బాటిల్స్.

Special water bottles for BRS silver jubilee celebration

కాగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు వరంగల్లోని ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు. తాజాగా కేసీఆర్ సభపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు.కేసీఆర్ సభ మరో మేడారం జాతరను తలపిస్తుందని.. జాతరకు ప్రజలు ఎలా తరలి వెళ్తారో మా సభకు కూడా అలానే వస్తారన్నారు. 25ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పండుగకు ఊరు, వాడ, పల్లె, పట్టణం కదులుతుందని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా సంతోషంతో వస్తారని.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి దాకా అందరికీ సంక్షేమాన్ని అందించిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news