నేటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 60వసంతాలు

-

నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26నఅప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ పోచంపాడ్ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సమయంలో ఇది ఒక ఆధునిక దేవాలయంగా నెహ్రూ పేర్కొన్నారు. 1978లో ప్రాజెక్టు పూర్తిచేయగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించి కాల్వల ద్వారా నీరు విడుదల చేశారు.

సాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేయగా.. 1983లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్​.. శ్రీరామసాగర్ ప్రాజెక్టు వద్ద విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉన్నందున జలవిద్యుత్‌ ఉత్పాదన కేంద్రం ఏర్పాటుకు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం గల జల విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేపట్టగా.. మొదట మూడు టర్బయిన్లు పూర్తి కాగా 1988లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్​ ప్రారంభించారు. ఉత్తర తెలంగాణలో 18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 60ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నేడు ప్రాజెక్ట్ వద్ద వేడుకలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news