హైదరాబాద్​లో స్టెమ్​క్యూర్స్ 54 మిలియన్ డాలర్ల పెట్టుబడి

-

మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో పెట్టుబడుల వేట వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా అమెరికాలోని ప్రముఖ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ అయిన స్టెమ్‌క్యూర్స్‌ హైదరాబాద్‌లో స్టెమ్‌ సెల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్లూమ్‌ సంస్థ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

అమెరికా ఆధారిత స్టెమ్‌క్యూర్స్ సంస్థ భారతదేశంలో అతిపెద్ద స్టెమ్ సెల్ తయారీ కర్మాగారాన్ని రూపొందించాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణలో ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ సదుపాయం సుమారు 54 మిలియన్ డాలర్ల పెట్టుబడి సామర్థ్యంతో.. రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ల్యాబ్‌ ద్వారా సుమారు 150 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ స్టెమ్‌క్యూర్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిరామ్‌ అట్లూరిని కలిసి చర్చించారు. స్టెమ్‌క్యూర్స్‌ను హైదరాబాద్‌కు స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version