ముస్లింల పర్వదినం మొహర్రం పండుగ ఈనెల 6న జరగనుంది. మొహర్రం నెల ప్రారంభమైన జూన్ 27వ తర్వాత పదవ రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. దీంతో 5న రేపు తెలంగాణలో ఆప్షనల్ హాలిడే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఇంకా ఈ విషయం పైన నిర్ణయం తీసుకోలేదు. ఇక రేపు ఆప్షనల్ హాలిడే సందర్భంగా విద్యాసంస్థలకు సెలవుపై స్థానిక విద్యాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు హాలిడే ఉండనుంది.

రేపు మొహర్రం పండుగ, ఎల్లుండి ఆదివారం కావడంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. యధావిధిగా సోమవారం రోజున పాఠశాలలు ప్రారంభమవుతాయి. కాగా, మరోవైపు తెలంగాణలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.