తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు విపరీతంగా పోటెత్తారు. తిరుమల స్వామి వారి సర్వదర్శనానికి గరిష్టంగా 24 గంటల సమయం పట్టె అవకాశాలు ఉన్నాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. నారాయణ గిరి షెడ్ల వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 64,015 మంది భక్తులు దర్శించుకున్నారు.

స్వామివారికి 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఆలయ హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. కాగా, భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు.