శంషాబాద్ లో దారుణం.. చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

-

శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్నారు విద్యార్థులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల సమీపంలో విద్యార్థులకు గత కొద్ది రోజులుగా చాక్లెట్లు పంపిణీ చేస్తున్నారు పాన్ డబ్బాల యజమానులు. ఆ చాక్లెట్లు తిని తరగతి గదిలో మత్తు లోకి జారడం, వింతగా ప్రవర్తించడం చేస్తున్నారు విద్యార్థులు.

Students are behaving strangely by eating chocolates

విద్యార్థుల వింత ప్రవర్తన గమనించిన ఉపాధ్యాయులు…విద్యార్థులను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడిందని సమాచారం. చాక్లెట్లు తినడం వల్లే విద్యార్థుల వింత ప్రవర్తన అని గుర్తించిన టీచర్లు… పాన్ డబ్బాల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔట్ సైడ్ ఫుడ్ తినొద్దని పిల్లలకు రోజు చెప్తూ ఉంటాము…..అయినా, చాక్లెట్లు అనేసరికి తీసుకొని తింటున్నారని టీచర్లు చెబుతున్నారు. ఇంకా ఎంతమంది విద్యార్థులు ఈ విధంగా ఉన్నారో పూర్తిస్థాయిలో తెలియదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news