తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులే భాగస్వాములు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులే భాగస్వాములు అని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. మా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.

గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం అన్నారు. పథకాలు తీసేయడానికి కాదు.. కులగణన సర్వే.. పథకాలను పెంచడానికి అన్నారు. బడ్జెట్ లో విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించినట్టు తెలిపారు. అన్నీ వర్సిటీలకు వీసీలను నియమించాం. పాఠశాల తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామన్నారు. కులగణన పై ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో 5వేల పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version