నెల రోజుల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ను వెంటాడుతోంది అవినీతి నిరోధక శాఖ. సరిగ్గా నెల రోజుల తర్వాత తస్లీమా, ఆమె బందువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ తరుణంలోనే.. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
ఇక నిన్నటి నుండి మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో ఆరు ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఇప్పటివరకు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు సంబంధించిన రూ 2 కోట్ల 94 లక్షల విలువగల ఆస్తులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం 22 కోట్ల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జైల్ లో రిమాండ్ లో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా చిప్ప కూడా తింటున్నారు.